#Cinema

Katha Venuka Katha In OTT : ‘కథ వెనుక కథ’కి ఓటీటీలో మంచి స్పందన

వేసవిలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంటిల్లిపాది చూసే సినిమాలకు మరింత ఆదరణ ఎక్కువ. అందులోనూ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్స్ మూవీస్ అంటే అన్నిరకాల ఆడియన్స్ ఇష్టపడతారు. హాయిగా కూర్చొని సినిమా చూస్తూ కాసేపు థ్రిల్ అయితే ఆ మజాయే వేరు. ఇప్పుడలాంటి సినిమానే ఈటీవీ విన్‌లో విడుదలైంది. డీసెంట్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ చిత్రం ఓటీటీలో మంచి ఆదరణను పొందుతోంది.

వేసవిలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంటిల్లిపాది చూసే సినిమాలకు మరింత ఆదరణ ఎక్కువ. అందులోనూ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్స్ మూవీస్ అంటే అన్నిరకాల ఆడియన్స్ ఇష్టపడతారు. హాయిగా కూర్చొని సినిమా చూస్తూ కాసేపు థ్రిల్ అయితే ఆ మజాయే వేరు. ఇప్పుడలాంటి సినిమానే ఈటీవీ విన్‌ (ETV Win)లో విడుదలైంది. డీసెంట్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’  చిత్రం ఓటీటీలో మంచి ఆదరణను పొందుతోంది.

ప్రముఖ హాస్యనటుడు సునీల్ , యువ హీరో విశ్వంత్ దుద్దుంపూడి , శ్రీజిత గౌష్, శుభశ్రీ, ఆలీ, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య ఇంటిల్లిపాది మెచ్చేలా సినిమాని తెరకెక్కించారని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ఔరా అనిపిస్తుంది. దర్శకుడై… తన మేనమామ కూతురుని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకునే హీరో విశ్వంత్… ఓ అప్ కమింగ్ డైరెక్టర్ నిజజీవితంలో సినిమా ఛాన్సుల కోసం ఎలాంటి ఇక్కట్లు ఎదుర్కొంటారో… అలాంటి హార్డిల్స్ ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారు. అందుకు తగ్గట్టుగానే విశ్వంత్ నటన ఇందులో ఉంటుంది. ఆలీ, సత్యం రాజేష్, ఛత్రపతి శేఖర్… ఇలా ఇందులో నటించిన వారంతా తమ శక్తిమేరకు నటించి మెప్పించారనే చెప్పొచ్చు. అలాంటి సినిమాని ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ ఆదరిస్తున్నందుకు నిర్మాత అవనీంద్రకుమార్ ఆనందం వ్యక్తం చేశారు.

నిర్మాణ విలువలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదని… అందుకే ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మా సినిమాని ఆడియన్స్ అంతలా ఆదరిస్తున్నారని.. ఇది మాకు ఎంతో బూస్టప్ నిచ్చిందన్నారు. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతో కష్టపడటం వల్లే సినిమా ఇంత క్వాలిటీగా వచ్చిందని.. వారందరికీ నిర్మాత అవనీంద్రకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *