#Cinema

Inspector Rishi : Another crime thriller series in OTT.ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్..

ఇటీవల రాఘవ లారెన్స్ జిగర్తాండ డబుల్ ఎక్స్ లో క్రూరత్వం పండించి మెప్పించిన నవీన్ త్వరలో ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో మన ముందుకు రానున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇన్ స్పెక్టర్ రిషి. ‘చట్టాలు అతీంద్రియ శక్తులను బంధించలేవు’ ఈ సిరీస్ క్యాప్షన్. సుఖ్‌దేవ్ ల‌హిరి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌ లో సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు

ఈ మధ్యన హీరోగానే కాకుండా విలన్ గా, డిఫరెంట్ రోల్స్ చేస్తూ వెర్సటైట్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు నవీన్ చంద్ర. ఇటీవల రాఘవ లారెన్స్ జిగర్తాండ డబుల్ ఎక్స్ లో క్రూరత్వం పండించి మెప్పించిన నవీన్ త్వరలో ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో మన ముందుకు రానున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇన్ స్పెక్టర్ రిషి. ‘చట్టాలు అతీంద్రియ శక్తులను బంధించలేవు’ ఈ సిరీస్ క్యాప్షన్. సుఖ్‌దేవ్ ల‌హిరి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌ లో సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నందిని దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ మార్చి 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానుంది. తమ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది అమెజాన్ ప్రైమ్.

ఇదే సందర్భంగా ఇన్ స్పెక్టర్ రిషి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది . ఇందులో నవీన్ చంద్ర చేతిలో తుపాకీ పట్టుకుని వెనక్కు తిరిగి చూస్తున్నట్లుగా ఇంటెన్స్ లుక్ లో దర్శనమిచ్చాడు. అలాగే అతని చుట్టూ దట్టమైన అడవి, తలపై కొమ్ములు, పొడవైన వెంట్రుకలతో కూడిన ఓ వింత ఆకారం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. చూస్తుంటే క్రైమ్ అంశాలకు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి ఈ వెబ్ సిరీస్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. మొత్తం 18 ఎపిసోడ్స్ గా ఉన్న ఇన్‌ స్పెక్టర్ రిషీ వెబ్ సిరీస్ లో నవీన్ చంద్ర ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు.

Inspector Rishi : Another crime thriller series in OTT.ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్..

Yatra 2 Now In OTT :  ఏపీలో

Leave a comment

Your email address will not be published. Required fields are marked *