#Cinema

HYDERABAD : ‘Chiru’ on stage at the South India Film Festival సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ వేదికపై ‘చిరు’ సత్కారం

సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ తొలి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో  మణిశర్మ, తనికెళ్ల భరణి, టీజీ విశ్వప్రసాద్‌, మురళీమోహన్‌, అల్లు అరవింద్‌, కె.ఎస్‌.రామారావు,మంచు లక్ష్మీతో పాటు పలు భాషలకి చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు. పద్మవిభూషణ్‌ గౌరవం పొందిన సందర్భంగా చిరంజీవిని ఈ వేదికపై సత్కరించారు. వేదకపై ఉన్న మెగాస్టార్‌కు ఆంజనేయుడి ప్రతిమను అల్లు అరవింద్‌, మురళీమోహన్‌, టీజీ విశ్వప్రసాద్‌లు అందించారు.

ఇప్పటికే పలు వేదికలపైన చిరంజీవిని పలువురు సత్కరించారు. గత నెలలో లాస్‌ ఏంజిల్స్‌లో తెలుగు అభిమానులు కూడా చిరును ఘనంగా సన్మానించారు. అమెరికాలోని మెగా ఫ్యాన్స్‌ ‘మెగా ఫెలిసిటేషన్‌ ఈవెంట్‌’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మెగాస్టార్‌ను గౌరవించారు. చిరంజీవికి అవార్డు వచ్చిన సమయంలో ఆయనకు పెద్ద సత్కారం చేయబోతున్నామని గతంలో ఇండస్ట్రీ పెద్దలు ప్రకటించారు కానీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *