#Cinema

Hero Siddharath – హీరో సిద్ధార్థ్‌ ‘‘నా కెరీర్‌లోనే అత్యుత్తమమైన సినిమా ‘చిన్నా’.

‘నా కెరీర్‌లోనే అత్యుత్తమమైన సినిమా ‘చిన్నా’. నేనింకా నటుడిగా ఎందుకు కొనసాగుతున్నాననే ప్రశ్నకు చెప్పే సమాధానం ఈ చిత్రం. ఇది చూశాక ‘సిద్ధార్థ్‌ చిత్రం ఇక చూడం’ అని మీకు అనిపిస్తే మళ్లీ ఈ నేలపై అడుగు పెట్టను’’ అన్నారు సిద్ధార్థ్‌. ఆయన హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రమే ‘చిన్నా’. ఎస్‌.యు.అరుణ్‌ కుమార్‌ తెరకెక్కించారు. అంజలీ నాయర్‌, సజయన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 6న తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో మంగళవారం ప్రీరిలీజ్‌ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ.. ‘‘చిన్నాన్న.. అతని అన్న కూతురుకి మధ్య ఉండే అనుబంధమే ఈ చిత్రం. ఈ చిత్రాన్ని తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్‌, కర్ణాటకలో ‘కేజీఎఫ్‌’ నిర్మాతలు, మలయాళంలో గోకులం గోపాలన్‌ కొన్నారు. తామెప్పుడూ ఇలాంటి చిత్రం చూడలేదని కొనియాడారు. కానీ, తెలుగులో ‘సిద్ధార్థ్‌ సినిమానా? ఎవరు చూస్తార’ని అడిగారు. ఆ సమయంలో నాకు అండగా నిలుస్తూ ఏషియన్‌ సంస్థ ముందుకొచ్చింది’’ అని భావోద్వేగంతో చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *