#Cinema

Hero Raviteja – రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’.

‘‘కొట్టే ముందు… కొట్టేసే ముందు వార్నింగ్‌ ఇవ్వడం నాకు అలవాటు’ అంటూ సందడి షురూ చేశారు రవితేజ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ కోసమే ఇదంతా! వంశీ దర్శకత్వం వహించిన చిత్రమిది. నుపూర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. పాన్‌ ఇండియా స్థాయిలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. రవితేజ, అనుపమ్‌ ఖేర్‌ ఇతర చిత్రబృందం పాల్గొంది. ‘స్టువర్టుపురం నాగేశ్వరరావు కథ అక్కడే ఆగిపోయింది కానీ, టైగర్‌ నాగేశ్వరరావు కథ అక్కడే మొదలైంది’ అంటూ సాగే సంభాషణతో ఆసక్తిని రేకెత్తించింది ట్రైలర్‌. దర్శకుడు వంశీ మాట్లాడుతూ ‘‘ఈ కథ విన్నప్పట్నుంచీ రవితేజ ఎంతగానో సహకారం అందించారు.ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైనది. అందరినీ అలరిస్తుంది’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో హిందీలోకి అడుగు పెడుతుండడం ఆనందంగా ఉంది. హిందీలో నేనే డబ్బింగ్‌ చెప్పా’’ అన్నారు. వంశీ ఈ కథలోని రెండు సన్నివేశాలు చెప్పగానే ఈ సినిమా చేయాలనుకున్నా, తను పెద్ద దర్శకుడు అవుతాడన్నారు రేణు దేశాయ్‌. జిషుసేన్‌ గుప్తా, నుపూర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌, అనుకృతి వ్యాస్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *