#Cinema

‘Skanda’.- హీరో రామ్ పోతినేని తాజా చిత్రం.

స్కంద’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు హీరో రామ్‌ పోతినేని (Ram Pothineni). బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారం జోరు పెంచారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. బాలీవుడ్‌ హీరోలపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

షారుక్‌ ఖాన్‌ను (Shah Rukh Khan) ఇటీవల తాను కలిసినట్లు రామ్‌ చెప్పారు. ‘‘అట్లీ దంపతులు నాకు మంచి స్నేహితులు. వాళ్లే నన్ను షారుక్‌ దగ్గరకు తీసుకెళ్లారు. ఇందుకు వాళ్లకు కృతజ్ఞతలు. ఇక షారుక్‌ చాలా మంచి వ్యక్తి. ఆయన్ని కలిసినప్పుడు ఎంతో మర్యాదగా వ్యవహరించారు. నా గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరం సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ఆయన ‘స్కంద’ ట్రైలర్‌ పంపమని అడిగారు’’ అని రామ్‌ పోతినేని చెప్పారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *