Hero Nani – నటిస్తోన్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’.

(Hero)హీరో(Nani) నాని నటిస్తోన్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ (Hai Nanna). దీని ప్రమోషన్స్‌లో నాని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
నేచురల్ స్టార్ నాని (Nani) తాను మొదటిసారి ప్రేమలో ఎప్పుడు పడ్డారో చెప్పారు. అలాగే ప్రస్తుతం తన క్రష్ ఎవరో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’..ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా రేడియో జాకీలతో (RJ) కలిసి చిట్‌చాట్ నిర్వహించారు.
‘‘ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. కానీ, నేను ప్రేమలో పడింది మాత్రం మూడో తరగతిలోనే. అప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో సోనీ అనే అమ్మాయి మంచి గౌను వేసుకుని వచ్చింది. నేనేమో ఆకులు చుట్టుకుని నిలబడ్డాను. ఇప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే.. ప్రస్తుతం నేనూ మంచి డ్రెస్ వేసుకున్నా కాబట్టి వెళ్లి తనని పలకరిస్తాను’’ అని సరదాగా చెప్పారు. అలాగే ప్రజెంట్ తన క్రష్ గురించి మాట్లాడుతూ కియారా ఖన్నా (హాయ్ నాన్న చైల్డ్ ఆర్టిస్టు) అంటే ఎంతో ఇష్టమని అన్నారు. ‘ఒకరోజు కియారా ఖన్నా చక్కగా రెడీ అయి సెట్‌కు వచ్చింది. భలే ముచ్చటగా అనిపించింది. నేను కనుక తన వయసులో ఉంటే తనపై మనసు పారేసుకునే వాడిని. కాబట్టి ప్రస్తుతం నా క్రష్ ఆ పాపనే’ అని చెప్పారు.