#Cinema

‘Hanuman’ team met Union Minister Amit Shah..

హనుమాన్ చిత్ర బృందం కేంద్ర మంత్రి అమిత్‌ షాను కలిసింది. తెలంగాణకు పర్యటనకు వచ్చిన ఆయనను హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వీరితో ఉన్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

హనుమాన్ చిత్ర బృందం కేంద్ర మంత్రి అమిత్‌ షాను కలిసింది. తెలంగాణకు పర్యటనకు వచ్చిన ఆయనను హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వీరితో ఉన్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డిలతో కలిసున్న ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ప్రశాంత్ వర్మ.. ‘గౌరవనీయులైన హోం శాఖ మంత్రి అమిత్ షాను, కిషన్ రెడ్డిని కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం. హనుమాన్ సినిమా గురించి ప్రోత్సాహకరమైన మాటలను చెప్పినందుకు ధన్యవాదాలు అమిత్ జీ. మిమ్మల్ని కలవడం చాలా ఆఆనందంగా ఉంది అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షాకు హనుమంతుడి విగ్రహంతో ఉన్న జ్ఞాపికను అందించారు హనుమాన్ టీమ్‌. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ రికార్డ్ స్థాయి కలెక్షన్లు సాధించింది. దీంతో హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యారు.

త్వరలోనే ఓటీటీలోకి..

హనుమాన్ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటించి మెప్పించింది. వినయ్ రాయ్ స్టైలిష్ విలన్ గా మెరవగా, సముద్ర ఖని, వెన్నెల కిశోర్, జబర్దస్త్‌ శీను, తదితరులు వివిధ పాత్రల్లో సందది చేశారు. ప్రైమ్‌ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్‌ రెడ్డి హనుమాన్ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.

‘Hanuman’ team met Union Minister Amit Shah..

Comedians as Heros

Leave a comment

Your email address will not be published. Required fields are marked *