#Cinema

‘Devara’ – ‘దేవర’

కథానాయకుడు ఎన్టీఆర్‌.. దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేగంగా చిత్రీకరణ చేసుకుంటోన్న ఈ సినిమా తాజాగా ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా సముద్రంలో రాత్రి పూట జరిగే ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించినట్లు ఛాయాగ్రాహకుడు రత్నవేలు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. ఈ ఫైట్‌కు సోలమన్‌ నేతృత్వం వహించారు. ఈ సినిమా కోసం శంషాబాద్‌లో ఓ ప్రత్యేకమైన సెట్‌ను సిద్ధం చేశారు. అందులోనే ఈ అండర్‌ వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు. దీనికోసం ఎన్టీఆర్‌ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. తీర ప్రాంత నేపథ్యంలో జరిగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ మాస్‌ యాక్షన్‌ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్‌ పూర్తి మాస్‌ అవతారంలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తోంది. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న రానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *