Daniel Balaji : Famous Tamil actor Daniel Balaji passed away ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వడ చెన్నై, కాఖా కాఖా, వేట్టైయాడు విళయాడు తదితర చిత్రాల్లో నటించారు.
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ(48) గుండెపోటుతో కన్నుమూశారు. ఛాతీలో నొప్పి కారణంగా నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వడ చెన్నై, కాక్క కాక్క, వేట్టైయాడు విళయాడు తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులో టక్ జగదీశ్, ఘర్షణతో పాటు పలు దక్షిణాది సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు.
టీవీ సీరియళ్ల ద్వారా కెరీర్ ప్రారంభించిన డేనియల్.. ‘చిట్టి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, మలయాళంతో కలిపి దాదాపు 40 సినిమాల్లో నటించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.