రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం -‘Chandramukhi 2’

ప్రేక్షకులు, అభిమానులు చూపించే ప్రేమలోనే దేవుణ్ని చూస్తున్నానన్నారు రాఘవ లారెన్స్. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చంద్రముఖి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). పి. వాసు దర్శకత్వం వహించారు. రజనీకాంత్ హిట్ చిత్రం ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో కంగనా రనౌత్ (Kangana Ranaut) కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28న విడుదల చేయనున్న సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.