#Cinema

‘Anupama Parameswaran’ coming as Janaki జానకిగా వచ్చేస్తున్న ‘అనుపమ పరమేశ్వరన్‌’

‘టిల్లు స్క్వేర్‌’తో హిట్‌ కొట్టిన అనుపమ పరమేశ్వరన్‌ నుంచి మరో కొత్త సినిమా రానుంది. మ‌ల‌యాళం సినిమా ‘జాన‌కి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ’ పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ ద్వారా దాదాపు రెండేళ్ల విరామం అనంత‌రం మ‌ల‌యాళంలోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

‘టిల్లు స్క్వేర్‌’లో గ్లామర్‌ పాత్రలో అదరగొట్టిన అనుపమ ఇప్పుడు కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడే పాత్రలో కనిపించనుంది.  ఇందులో జానకిగా అనుపమ ప్రేక్షకుల ముందుకు రానుంది.  లాయర్‌గా మ‌ల‌యాళ సీనియ‌ర్  నటుడు సురేశ్‌ గోపి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ పనులు పూర్తి చేసుకున్న అనుపమ దర్శకుడితో ఉన్న ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాలో పంచుకుంది. ‘నా తదుపరి చిత్రానికి డబ్బింగ్‌ పూర్తైంది’ అంటూ అందులో రాసుకొచ్చింది.

కేరళ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా న్యాయం కోసం పోరాడే జాన‌కి అనే యువ‌తిగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌నిపించ‌నుండగా.. ఆమె త‌ర‌ఫున‌ కేసును వాదించే లాయ‌ర్ పాత్ర‌లో సురేష్ గోపి న‌టిస్తున్నాడు. మ‌ల‌యాళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్ర‌వీణ్ నారాయ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాతో సురేష్‌ గోపి కుమారుడు మాధ‌వ్ సురేష్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *