#Cinema

Allu Arjun stepped in Vizag amidst the cheers of his fans అభిమానుల ఆనందోత్సాహాల మధ్య వైజాగ్‌లో అడుగు పెట్టిన అల్లు అర్జున్‌

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ కోసమని విశాఖపట్నంలో అడుగు పెట్టినప్పుడు వేలాదిమంది అతని అభిమానులు విమానాశ్రయంకి రావటమే కాకుండా, అర్జున్ వున్న వాహనంతో పాటు బైక్ ర్యాలీ నిర్వహించి, అర్జున్ పై పూల వర్షం కురిపించారు.

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం వెళ్లారు. ఇది విజయవంతం అయిన ‘పుష్ప’ సినిమాకి రెండో భాగంగా వస్తున్న సినిమా. మొదటి సినిమా ఎంతటి విజయం సాధించింది, అల్లు అర్జున్ కి ఎంత పేరు తీసుకువచ్చింది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ రెండో పార్టు ఆగస్టు 15న విడుదలవుతోంది. అందుకోసం షూటింగ్ కూడా త్వరితగతిని పూర్తి చెయ్యడానికి చూస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్, నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్.

ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కోసమని విశాఖపట్నం వెళ్లిన అల్లు అర్జున్ కి విశాఖ విమానాశ్రయంలో అయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. అతను హైదరాబాదు నుండి విశాఖపట్నం బయలుదేరగానే విశాఖ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు చేరుకున్నారు. విమానాశ్రయం నుండి బయటకి వచ్చిన అర్జున్ అభిమానులకి అభివాదం చేస్తూనే ఇక తాను బస చేసిన హోటల్ వరకు వెళ్లారు.

అల్లు అర్జున్ కూడా ఇంతమంది అభిమానులు వస్తారని ముందుగా ఊహించి వుండరు. మామూలుగా సినిమా నటులు హైదరాబాదు నుండి బయట ప్రదేశాలకి వెళ్ళినప్పుడు విమానాశ్రయం దగ్గర కొంతమంది అభిమానులు ఉంటూ వుంటారు. కానీ అర్జున్ విషయంలో అలా కాకుండా కొన్ని వేలమంది అభిమానులు విమానాశ్రయానికి రావటంతో పాటు, తన అభిమాన నటుడు వాహనం ముందు కొన్ని వందల మోటారు సైకిళ్లతో ప్రయాణం చేస్తూ పూల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ కి ఇప్పుడు ఎంత క్రేజ్ వుంది అనేది తెలుస్తోంది.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేట్‌తో మైత్రీమూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ రోజు నుంచి వైజాగ్‌లో ప్రారంభ‌మైంది. అభిమానులు ఆప్యాయత‌ను చూసి ఐకాన్‌స్టార్ ఫిదా అయిపోయారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *