Ajith Kumar: ఆస్పత్రికి స్టార్ హీరో అజిత్ కుమార్.. అసలేమైంది?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడీయాలో తెగ వైరలవతున్నాయి. ఇంతకీ తమ స్టార్ హీరోకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
అయితే కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని సన్నిహత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన విడాయమర్చి చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కోసం ఆయన త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అందుకే రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం వెళ్లారని అజిత్ సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి రూమర్స్ అభిమానులు నమ్మవద్దని కోరుతున్నారు. త్వరలోనే బయటికి వస్తారని వెల్లడించారు.
ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తోన్న విడాయమర్చి చిత్రానికి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్‌కు జోడీగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో అజిత్, త్రిష కలిసి 2015లో ఎన్నై అరిందాళ్ అనే సినిమా చేశారు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ జతకట్టారు.