ఏపీ మహిళల అకౌంట్‌లలోకి డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.18,750

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనకు వెళుతున్నారు. గురువారం ఆయన వైఎస్సార్ చేయూత పథకం కింద నాలుగో విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేస్తారు. ముఖ్యమంత్రి గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కశింకోట చేరుకుంటారు.. అక్కడినుంచి పిసినికాడ చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేసి.. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
ప్రధానాంశాలు:
- ఏపీలో మహిళల అకౌంట్‌లలోకి డబ్బులు
- అనకాపల్లి జిల్లాలో సీఎం షెడ్యూల్ ఇలా
- వరుసగా నాలుగో విడత చేయూత నిధులు
ఏపీలో మహిళలకు సంబంధించిన మరో పథకానికి సంబంధించిన డబ్బుల్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. గురువారం (మార్చి 07న) అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు.సీఎం ప్రత్యేక విమానంలో ఉదయం 10.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.45 గంటలకు కశింకోట మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో 10 నిమిషాల పాటు ముచ్చటిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి 11.15 గంటలకు పిసినికాడ వద్ద గల సభావేదిక వద్దకు చేరుకుంటారు.