#Andhra Politics #Elections

TDP: త్వరలో తెదేపా రెండో జాబితా.. చంద్రబాబును కలిసిన ఆశావహులు

రానున్న ఎన్నికల్లో తెదేపా (TDP) టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ వెళ్లారు.

అమరావతి: రానున్న ఎన్నికల్లో తెదేపా (TDP) టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ వెళ్లారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి పెందుర్తి నేత బండారు అప్పలనాయుడు చంద్రబాబుతో సమావేశమయ్యారు.

సర్వేపల్లి టికెట్‌పై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చర్చించారు. పలాస టికెట్‌ను గౌతు శిరీష.. పెందుర్తి స్థానాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆశిస్తున్నారు. దీంతో గౌతు శివాజీ, బండారు అప్పలనాయుడు అధినేతను కలిశారు. త్వరలో తెదేపా రెండో జాబితా విడుదల కానుంది. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆయా స్థానాల్లో స్పష్టత కోసం వారు చంద్రబాబుతో చర్చలు జరిపారు.

TDP: త్వరలో తెదేపా రెండో జాబితా.. చంద్రబాబును కలిసిన ఆశావహులు

మళ్లీ జగన్‌ భజన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *