Nara Lokesh Public Is Graphics In YCP Meeting : వైకాపా ‘సిద్ధం’ సభలో జనమంతా గ్రాఫిక్స్: లోకేశ్

జగన్‌కు ధర్మ యుద్ధం ఇవ్వడానికి తెలుగుదేశం – జనసేన సిద్ధంగా ఉన్నాయని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కళలకు నిలయంగా ఉన్న రాజమహేంద్రవరం.. వైకాపా పాలనలో అరాచకాలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు.

మేదరమెట్ల వైకాపా ‘సిద్ధం’ సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్టు చేశారు.

అమరావతి: మేదరమెట్ల వైకాపా ‘సిద్ధం’ సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్టు చేశారు. ఒక గుంపు జనాన్ని పలుచోట్ల అమర్చారంటూ కొన్ని ఫొటోలను ఆయన బయటపెట్టారు. ఏకంగా మార్ఫింగ్ ఫొటోలు వేసిన వైనం చరిత్రలో ఎప్పుడైనా చూశారా?అని ప్రశ్నించారు. డ్రోన్ చిత్రాలు, గ్రీన్ మ్యాట్‌తో దొరికిపోయారని.. ఇప్పుడు ఏకంగా మార్ఫింగ్ చేసి ఫొటోలు వదిలారని ఎద్దేవా చేశారు. జగన్‌కు ప్రజల మద్దతు లేదని.. ఎంత ప్రయత్నించినా ఆయన్ను చిత్తుగా ఓడించడం ఖాయమని లోకేశ్ పేర్కొన్నారు.