#ANDHRA ELECTIONS #Andhra Politics #Elections

Janasena: Pawan Kalyan announced MLA candidate ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జనసేన జోరు పెంచుతోంది. కూటమిలో భాగంగా జనసేనకు వచ్చిన అన్ని సీట్లలోనూ పాగా వేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐదు మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్.. తాజాగా.. మరో సీనియర్ నేతను నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు..

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జనసేన జోరు పెంచుతోంది. కూటమిలో భాగంగా జనసేనకు వచ్చిన అన్ని సీట్లలోనూ పాగా వేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐదు మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్.. తాజాగా.. మరో సీనియర్ నేతను నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. కందుల దుర్గేష్‌ను నిడదవోలు ఎంపీగా పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దుర్గేష్.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున దుర్గేష్‌ను ఎన్నికల బరిలో దింపుతున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటన చేసింది.

పెద్ద కథే జరిగింది..!

కాగా.. రాజమండ్రి రూరల్ నుంచి జనసేన అభ్యర్థిగా తాను బరిలో ఉంటానని కందుల దుర్గేష్‌ పలుమార్లు ప్రకటనలు చేశారు. అయితే ఇది టీడీపీ సిట్టింగ్ సీటు కావడం.. పైగా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్థానం కావడంతో కూటమికి పెద్ద చిక్కొచ్చిపడినట్లయ్యింది. ఒకానొక సందర్భంలో సీటు రాదని డీలా పడిన బుచ్చయ్యకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. సిట్టింగ్ స్థానం రాకపోయిన మరోచోట నుంచి అవకాశం వస్తుందని హామీ ఇచ్చారు. అప్పట్లో రాజమండ్రి రూరల్ నుంచి దుర్గేష్.. నిడదవోలు నుంచి బుచ్చయ్యను పోటీ చేయించే యోచనలో టీడీపీ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆఖరికి సీన్ మొత్తం రివర్సే అయ్యింది. బుచ్చయ్యకు సిట్టింగ్ స్థానం దాదాపు ఖరారవ్వగా అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. ఇప్పుడిక కందుల దుర్గేష్‌కు నిడదవోలు ఇస్తున్నట్లు పవన్ ప్రకటించడంతో.. గోరంట్లకు పెద్ద తలనొప్పే తగ్గిందని అభిమానులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

Janasena: Pawan Kalyan announced MLA candidate ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్

Allu Arjun stepped in Vizag amidst the

Leave a comment

Your email address will not be published. Required fields are marked *