#ANDHRA ELECTIONS #Andhra Politics #Elections

AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా

బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకమున్నా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని సీఈవో స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పైనా గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సీల్ లేదని వాటిని ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణించకూడదని పేర్కొన్నారు. ఓటర్ తమ ఓటును బ్యాలెట్ పేపర్‌లో సక్రమంగా వేశారా? లేదా? అని మాత్రమే చూడాలని ఆదేశించారు.

అమరావతి మే 26: బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకమున్నా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని సీఈవో స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పైనా గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సీల్ లేదని వాటిని ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణించకూడదని పేర్కొన్నారు. ఓటర్ తమ ఓటును బ్యాలెట్ పేపర్‌లో సక్రమంగా వేశారా? లేదా? అని మాత్రమే చూడాలని ఆదేశించారు.

ఈ మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు పంపినట్లు సీఈవో మీనా వెల్లడించారు. దీనిపై రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, సూపర్ వైజర్లకు జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే సమాచారం ఇవ్వాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. అవసరమైతే శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వెనక రిటర్నింగ్ అధికారి సీల్ వేయడం.. ఆయన బాధ్యతే అని స్పష్టం చేశారు. అదే విధంగా ఫెసిలిటేషన్ సెంటర్‌లో గెజిటెడ్ అధికారి సంతకం చేయడం, సీల్ వేయడం కూడా అక్కడి అధికారులు బాధ్యతే అని గుర్తు చేశారు. వీటిని అడ్డుగా చూపి ఇన్‌వ్యాలిడ్‌గా పరిణించకూడదన్నారు.

సీఈవో ఆదేశాలతో ప్రతిపక్షాలు, తెదేపా కూటమికి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులంతా తమ వెంటే ఉన్నారంటూ టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. ఈ ఆదేశాలతో తమ ఓటు శాతం పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *