#Andhra Politics #ANDHRA PRADESH #Elections

కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరం: వెంకయ్యనాయుడు

ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

కాకినాడ: ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశా.. పెదవి విరమణ చేయలేదు. తెలుగు భాష, సాహిత్యం వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తా. భాష భావ వ్యక్తీకరణకు దోహదం చేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వాలు భాషను ప్రోత్సహించట్లేదు. భాష వ్యాప్తికి దిన పత్రికలు, సినిమాలు దోహదం చేస్తాయి. తెలుగు భాషతోపాటు.. సోదర భాషలను నేర్చుకుందాం. రాజకీయాల్లో కుతంత్రాలు ఎదుర్కోవాలంటే పంచతంత్రాలు నేర్చుకోవాలి’ అని ఆయన అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *