An engineering student who was overtaking a lorry died.-\లారీని ఓవర్‌టేక్ చేస్తున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందాడు….

హైదరాబాద్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాయ్ సర్ నగర్‌లో ఇద్దరు యువకులు బైక్‌పై డీసీఎంను దాటుతుండగా అదుపు తప్పి కిందపడ్డారు. వీరి వెనుక వస్తున్న టిప్పర్‌ వారిపై నుంచి వెళ్లడంతో ఒక్కసారిగా ప్రాణాలు విడిచారు . సీఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మల్లంపేటలో నివాసముంటున్న పవన్ (21), మణిదీప్ (20) బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. దుండిగల్ IARE ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు.
సోమవారం కళాశాల నుంచి తిరిగి వస్తుండగా ముందుగా ప్రయాణిస్తున్న డీసీఎంను దాటి కాయ్‌సర్‌ నగర్‌ సమీపంలో అదుపు తప్పి కింద పడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న టిప్పర్ వారిపైకి దూసుకెళ్లడంతో పవన్‌కు తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు మణిదీప్‌ను ఆస్పత్రికి తరలించారు. మృతుడు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బూరుగుపల్లి తండాకు చెందిన పవన్‌గా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.