Aditya-L1కు సంబంధించి ఇస్రో మరో కీలక విన్యాసం

ఆదిత్య-ఎల్1కు సంబంధించి ఇస్రో మరో కీలక విన్యాసం చేపట్టింది. ప్రస్తుతం లగ్రాంజియన్-1(ఎల్1) పాయింట్ దిశగా వెళుతున్న ఉపగ్రహ మార్గాన్ని సరిదిద్దే విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఆదివారం వెల్లడించింది. దీని కోసం స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను 16 సెకన్ల పాటు మండించామని తెలిపింది. అక్టోబరు 6న చేపట్టిన ఈ విన్యాసం వల్ల ఉపగ్రహం వేగం పెరిగి ఎల్1 వైపు మరింత కచ్చితత్వంతో ప్రయాణిస్తోందని ఇస్రో పేర్కొంది.