#Nalgonda District

Gutha Sukhender Fire – గుత్తా సుఖేందర్‌ ఫైర్‌….

నల్లగొండ: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో అస్సలు బీజేపీ పాత్ర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రజలపై ప్రధాని మోదీ మరోసారి విషం కక్కారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్స్ తీసుకొచ్చింది. ఆచరణకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ స్కీమ్స్ ఎందుకు అమలు చేయడం లేదు.

తెలంగాణ ఉద్యమం సమయంలో కిషన్ రెడ్డి తెలంగాణ కోసం ఎందుకు రాజీనామా చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకునేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Gutha Sukhender Fire – గుత్తా సుఖేందర్‌ ఫైర్‌….

The first mission undertaken by the ISRO

Leave a comment

Your email address will not be published. Required fields are marked *