#తెలంగాణ

Cultivation of crops during the monsoon season in Telangana exceeded the normal target – తెలంగాణలో వానాకాలం సీజన్‌లో సాధారణ లక్ష్యాన్ని మించి పంటల సాగు జరిగింది

తెలంగాణలో వానాకాలం సీజన్‌లో పంటల సాగు సాధారణ లక్ష్యాన్ని అధిగమించింది. 1,24,28,723 ఎకరాలకు గాను బుధవారం వరకు 1,25,05,641 (100.62) ఎకరాల్లో రైతులు పంటలు వేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. నిరుడు సాగైన 1,31,22,539 ఎకరాలతో పోల్చుకుంటే ఈసారి దాదాపు ఆరు లక్షల ఎకరాల మేర విస్తీర్ణం తగ్గిందని తెలిపింది. వరి సాగు 49,86,634 ఎకరాల సగటుకు గాను 63,55,986 ఎకరాల (127.46 శాతం)లో నాట్లు పడ్డాయి.  పత్తి 50,59,225 ఎకరాల లక్ష్యానికి గాను 45,00,475 ఎకరాలు (88.96 శాతం) సాగవుతోందని వ్యవసాయశాఖ వెల్లడించింది. 18 జిల్లాలు 100 శాతానికి పైగా సాగు లక్ష్యాన్ని అధిగమించాయని తెలిపింది. రాష్ట్రంలో మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, పప్పు దినుసులు, సోయాబీన్‌, పత్తి సాగు ముగియగా… మరికొద్ది రోజులు వరినాట్లు, కొన్ని మెట్ట పంటలు కొనసాగుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది.

  • ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబాబాద్‌, జనగామ, నల్గొండ, భద్రాద్రి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, యాదాద్రి వంద శాతం లక్ష్యాన్ని అధిగమించాయి.
  • వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 638.1 మిల్లీమీటర్ల సగటుకుగాను 779.3 మిల్లీమీటర్ల (20 శాతం అధికం) వర్షపాతం నమోదైందని పేర్కొంది. 22 జిల్లాల్లో అధికంగా, మిగిలిన 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
Cultivation of crops during the monsoon season in Telangana exceeded the normal target – తెలంగాణలో వానాకాలం సీజన్‌లో సాధారణ లక్ష్యాన్ని మించి పంటల సాగు జరిగింది

54 tenders for purchase of grain –

Cultivation of crops during the monsoon season in Telangana exceeded the normal target – తెలంగాణలో వానాకాలం సీజన్‌లో సాధారణ లక్ష్యాన్ని మించి పంటల సాగు జరిగింది

Kalvakuntla firey comments on ED Notices –

Leave a comment

Your email address will not be published. Required fields are marked *