Don’t forget the decency.. don’t ignore the elders – మమకారం మరువకు.. పెద్దలను విస్మరించకు

తొమ్మిది నెలలు మోసి కని పెద్ద చేసిన తల్లి.. బాధ్యతగా చదివించి సద్భుద్ధులు నేర్పి ప్రయోజకున్ని చేసిన తండ్రిని పిల్లలు దూరం చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వృద్ధాప్యంలో అండగా ఉంటారనుకుంటే భారం దింపుకొనేలా వ్యవహరిస్తుండటంతో చెప్పుకోలేని క్షోభ అనుభవిస్తున్నారు. చట్ట పరిధిలో వారికుండే రక్షణ, తదితర విషయాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.
వద్ధాప్యంలో కన్నవారిని కంటికి రెప్పలా చేసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులదే. వారిని చీదరించుకోవడం.. సూటిపోటి మాటలతో వారి మనసు నొప్పించడమే కాకుండా అక్కడక్కడా కొందరు చేయి చేసుకుంటున్నారు. అలాంటి వృద్ధులకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు రూపొందించింది. బాసటగా నిలిచేలా సీˆనియర్ సిటిజన్ హెల్ప్‌లైన్ సర్వీస్ యెల్డర్ లైన్ సేవా కేంద్రం ఉంది. తల్లిదండ్రులను వేధించినా, వదిలేసినా నిరాదరణకు గురయ్యేవారు టోల్ ఫ్రీˆ నంబర్ 14567కు ఫోన్ చేస్తే 24 గంటల్లో వారిని అడ్డుకొని సంరక్షణ కల్పిస్తుంది. జిల్లా సంక్షేమ శాఖ పరిధిలో ఈ విభాగం పని చేస్తోంది.