#Trending

Another ED notice to Kavitha! – కవితకు మరోసారి ఈడీ నోటీస్! రేపే అరెస్ట్ ఉంటుందా!?

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి అనూహ్యంగా మలుపు తిరిగింది. గత కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న ఈ కేసు ఉన్నపలంగా తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు (BRS MLC Kavitha) తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపే (శుక్రవారం) విచారణకు హాజరుకావాలంటూ నోటీసులో పేర్కొంది. దీంతో ఏం జరుగుతోందోనన్న సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. గతంలోనే కవితను అరెస్ట్ చేస్తారని వార్తలు షికార్లు చేశాయి. కానీ అలాంటి దాఖలాలు ఎక్కడా జరగలేదు. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనని ఆరోపణలకు తావిచ్చింది. ఇలాంటి తరుణంలో ఉన్నట్టుండి కవితకు నోటీసులు ఇవ్వడంపై మరోసారి చర్చకు దారి తీసింది.

సౌత్ గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా అఫ్రూవర్లుగా మారిపోయారు. దీంతో ఈ కేసు మళ్లీ మొదటికొచ్చింది. ఇందులో భాగంగానే కవితకు ఈడీ (ED) మళ్లీ నోటీసులు ఇచ్చిందన్న టాక్ నడుస్తోంది. గతంలో పలుమార్లు కవిత విచారణకు హాజరైనప్పుడు అరెస్ట్ చేస్తారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ అలాంటి పరిణామాలు జరగలేదు. కానీ తాజాగా మరోసారి ఈడీ నోటీసు ఇవ్వడంతో ఈసారి మాత్రం కవిత అరెస్ట్ గ్యారెంటీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రేపు ఏం జరగబోతోందనన్న ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్‌తో (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌గా కాకరేపుతోంది. ఇలాంటి సమయంలో కవితకు నోటీసులు ఇవ్వడం.. పైగా అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు వినిబడుతున్న నేపథ్యంలో అసలేం జరుగుతోందన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *