#Mancherial District

Prayas is a platform for social research – సామాజిక పరిశోధనల వేదిక ప్రయాస్‌

పాఠశాల విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారి సామాజిక పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రయాస్‌-2023 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తోంది. విద్యార్థి దశలోనే శాస్త్రీయ విజ్ఞానంపై మక్కువ పెంచుకొని వారి సృజనాత్మకతను పెంపొందించుకునేందుకు ఇది చక్కటి వేదిక. ఉత్తమ ప్రదర్శనలకు ప్రోత్సాహకాలు సైతం ఇవ్వనున్నారు.  ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీలోగా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకునే  అవకాశాన్ని కల్పించింది.

పోటీ అంశాలు ప్రధానంగా

  • స్థానిక సమస్యను గుర్తించి అధ్యయనం చేయడం
  • స్థానిక సమస్య వెనక శాస్త్రీయ కారణాన్ని పరిశోధించడం
  • ఏదైనా సమస్యకు శాస్త్రీయ పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం
  • శాస్త్రీయంగా రూపొందించడానికి ఉద్దేశించిన ఏదైనా ఆలోచన

రూ.50 వేల ప్రోత్సాహం

విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కారానికి శాస్త్రీయ పరిశోధన చేయాలి. తమ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల సాయం కూడా తీసుకుని తగిన ఆలోచనలు పంచుకోవచ్చు. ఎంపికైన ప్రతిపాదనలకు రూ.50 వేల ప్రోత్సాహం అందించనున్నారు.

9 నుంచి ఇంటర్‌ విద్యార్థులు అర్హులు

పోటీల్లో పాల్గొనే విద్యార్థులు 14-18 సంవత్సరాల వయసుండాలి. ప్రస్తుతం 9-11 వ తరగతి చదువుతున్న అన్ని యాజమాన్య పాఠశాలలకు చెందిన వారు దరఖాస్తు చేసుకునేంద]ుకు అర్హులు. ఒకరు కాని ఇద్దరు కాని గ్రూపుగా ఏర్పడి తమ పరిశోధనను కొనసాగించవచ్చు. 9-12వ తరగతులకు బోధించే ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, గణితం, జీవశాస్త్రం బోధించే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ గైడ్‌గా వ్యవహరించవచ్చు విద్యార్థులకు తమ ఆలోచనలు pravaasncert.gmail.com కు మెయిల్‌ చేయాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *