#Telangana #Telangana History

“Fire Safety & Fire Prevention Campaign 2023” – “ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్ 2023”

రిలయన్స్ జియోతన నెట్వర్క్ సైట్‌లు, సౌకర్యాల భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో తెలంగాణలో “ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్ 2023″ని ప్రారంభించింది. “ఫైర్ ప్రివెన్షన్ – మస్ట్ ఫర్ నెట్‌వర్క్ అవైలబిలిటి అండ్ సర్వీస్ తో కస్టమర్” అనే థీమ్ తో ఈ సమగ్ర ప్రచారాన్ని జియో తెలంగాణ ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 15, 2023 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ నిర్వహణ పాయింట్లు, జియో సెంటర్‌ ప్రాంతాలు, అన్ని నెట్‌వర్క్‌ సైట్ లను కవర్ చేస్తూ నిర్వహిస్తోంది.

జియో ఉద్యోగులు, సర్వీస్ పార్టనర్ ఉద్యోగులు, ఇతర వాటాదారులలో అగ్ని ప్రమాదాల పై భద్రత యొక్క లోతైన భావాన్ని కలిగించడం ఈ ప్రచారం యొక్క ప్రాథమిక లక్ష్యం. వారి నైపుణ్యాలు, పరిజ్ఞానంస, అవగాహన పెంచడం ద్వారా అగ్ని ప్రమాదాలను కనిష్ట స్థాయికి తగ్గించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది, “జీరో ఫైర్ ఇన్సిడెంట్ ఎట్ సైట్” కోసం జియో ప్రయత్నిస్తోంది.

తన ఉద్యోగులు, సేవా భాగస్వాముల శ్రేయస్సు, నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క అంతరాయం లేని సేవలకు అగ్నిమాపక భద్రత చాలా ముఖ్యమైనదని జియో తెలంగాణ భావిస్తోంది. ఫైర్-సంబంధిత సంఘటనలను నివారించడంలో ఫీల్డ్ టీమ్‌లలో ఫైర్ సేఫ్టీ అవగాహన చాలా కీలకమని కంపెనీ గుర్తించింది.

ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా, ఫైర్ ప్రివెన్షన్, సేఫ్టీ ప్రోటోకాల్స్‌పై సమగ్ర శిక్షణా సెషన్‌లు; ఫైర్ సేఫ్టీ కసరత్తులు; వివరైన సమాచారం, వనరుల పంపిణీ; రాష్ట్రవ్యాప్తంగా ఆకర్షణీయమైన వర్క్‌షాప్‌లు, ఇంటరాక్టివ్ సెషన్‌లు నిర్వహించబడ్డాయి.

అగ్ని మాపక భద్రత, నివారణ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా, జియో తెలంగాణ తన నెట్వర్క్ సైట్ల సౌకర్యాలను కాపాడటమే కాకుండా నెట్‌వర్క్ విశ్వసనీయతకు, అంతిమంగా, దాని వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

“Fire Safety & Fire Prevention Campaign 2023” – “ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్ 2023”

Good news for TS RTC employees.. –

“Fire Safety & Fire Prevention Campaign 2023” – “ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్ 2023”

Distribution of fortified rice in the joint

Leave a comment

Your email address will not be published. Required fields are marked *