ఆరోసారి బరిలో ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్ (Adilabad) : ఎమ్మెల్యే జోగు రామన్నకు (Jogu Ramanna) టికెట్ ఖరారు కావడంతో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పగలగొట్టి మిఠాయిలు పంచిపెట్టారు. ఎమ్మెల్యే రామన్నను భుజాలపై వేసుకుని నృత్యాలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ (BRS party) విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజని, పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అజయ్, అష్రఫ్, నాయకులు సాజిద్ పాల్గొన్నారు. అలాగే బోథ్ నియోజకవర్గంలో అనిల్ జాదవ్ కు టికెట్ రావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
ఆరోసారి బరిలో ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ నియోజకవర్గం (Adilabad Assembly Constituency) నుంచి ఆరోసారి పోటీ చేసేందుకు ఎమ్మెల్యే జోగు రామన్న సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్ నుంచి నాలుగోసారి పోటీ చేసేందుకు తాము సిద్ధమని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ (KCR) ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యేల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా గెలిచి 2014లో తెలంగాణ తొలి శాసనసభకు ఎన్నికై రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
తొలిసారి ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు.
జోగు రామన్న రాజకీయ చరిత్రలో విజయాలున్నాయి. 2004లో ఆదిలాబాద్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సి.రాంచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ అభ్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసి సీఆర్‌ఆర్‌పై విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో 2011లో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన అదే ఏడాది నవంబర్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
2012 మార్చిలో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి సీఆర్‌ఆర్‌పై విజయం సాధించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌పై విజయం సాధించారు. 2018లో మరోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన శంకర్‌పై విజయం సాధించారు.