తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలు

తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కేసీఆర్ సర్కార్ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై అధికారులతో కేసీఆర్ సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోన్నారు. ఎన్నికల వేళ అవతరణ దినోత్సవ వేడుకలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ వేడుకల ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు.
జూన్ 2 నుంచి 21వ తేదీ వరకు 21 రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించగా.. తాజాగా కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం చేపట్టేలా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. జూన్ 2న హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తాపానికి నివాళులు అర్పించడంతో పాటు సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కేసీఆర్ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఆ రోజు అన్ని జిల్లాల్లో మంత్రులు ఉత్సవాలను ప్రారంభించనున్నారు.