WTITC : ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు సింగపూర్‌లో ఆగస్టు 6వ తేదీన ఘనంగా జరిగాయి.

సింగపూర్‌లో ఆగస్టు 6వ తేదీన WTITC ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సభలకు ప్రపంచ నలుమూలల నుంచి అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖలు, వ్యవస్థాపకులు, ఐటీ పరిశ్రమకు చెందిన నిపుణులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లు, టెక్నోక్రాట్స్ వేలాదిగా పాల్గొన్నారు. మరియు ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ గారు, తెలంగాణ రాష్ట్ర ఐటీ సెక్రెటరీ శ్రీ జయేష్ రంజన్ గారులతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మహాసభల్లో నిపుణులకు, ప్రతిభ కనపరిచిన వారికి ఎక్సలెన్స్ అవార్డులు . ప్రముఖుల సమక్షంలో పురస్కారాలను ప్రదానం చేసారు.
ఈ కాన్ఫరెన్స్ లో ఇటు పరిశ్రమ అభివృద్ధి అటు స్వరాష్ట్రంలో పెట్టుబడులు అనే అంశంపై విస్తృత అవకాశాలు అందించేందుకు అనేక దేశాల నుంచి డెలిగేట్లు హాజరు కాగా . ఈ మహాసభ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సత్తాను చాటి చెప్పామని నిర్వాహకులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు . ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ప్రవేశ పెట్టిన ముఖ్యమైన విధానాలు, నిర్ణయాలకు సంబంధిత ఉన్నతాధికారుల నుంచి తెలుసుకునే అవకాశం కలిగింది . టెక్నికల్ ప్రజెంటేషన్, థాట్ ప్రొవొకింగ్ డిస్కషన్స్ వంటివి ఈ మహాసభల్లో భాగం చేయడం వల్ల పాల్గోన్న వారికి కేవలం ప్రొఫెషనల్ నెట్‌వర్క్ విస్తరించుకోవడమే కాకుండా వారి సాంకేతిక పరిజ్ఞానం సైతం పెంపొందించుకునే అవకాశం దక్కింది .
WTITC గ్లోబల్ చైర్మన్ ఐన సందీప్ మఖ్తల గారు మాట్లాడుతూ. WTITC యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని తెలుగు IT ప్రొఫెషనల్స్ ను ఒక వేదిక పైకి తీసుకు రావటం, ఈ వేదిక ద్వారా వివిధ దేశాలలోని వారందరు ప్రొఫెషనల్ నెట్‌వర్క్ మరియు సాంకేతిక పరిజ్ఞానం విస్తరించుకోవడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు సభలో ప్రసంగిస్తూ తెలుగువారిలో ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువమంది, టెక్నోక్రాట్స్ అందర్నీ కలుపుకోవడానికి ఈ WTITC ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని అన్నారు.
దుబాయ్ రాయల్ ఫామిలీ మెంబెర్ యు అయిన అబ్దుల్లాహ్ గారు మరియు ఒమాన్ రాయల్ ఫామిలీ మెంబెర్ అయిన హిఘ్న్స్ ఫైరస్ బిన్ ఫాతిక్ గారు ముఖ్య అతిధులుగా విచ్చేసారు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని వారి అభినందనలను తెలిపారు.
ప్రాముఖ్యంగా ప్రపంచ మొదటి కంప్లీట్ AI టెక్నాలజీ అయిన “బంగారు AI ” ప్లాట్ఫారం మరియు AI న్యూస్ ఛానల్ అయిన బంగారు తెలంగాణ ఛానల్ లాంచ్ అవ్వటం అందరిని అబ్బుర పరిచింది . బంగారు AI టెక్నాలజీ సీఈఓ అండ్ డైరెక్టర్ ఐన శ్రీ క్రాంతి కుమార్ కుక్కల గారు మాట్లాడుతూ వరల్డ్స్ ఫస్ట్ AI న్యూస్ టెక్నాలజీని WTITC సింగపూర్ కాన్ఫెరెన్స్లో లాంచ్ చెయ్యటం ఎంతో ఆనందంగా వుంది అని పేర్కొన్నారు . లాంచ్ సమయంలో ప్రదర్శించిన AI న్యూస్ లాంచ్ ప్రోమో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రముఖ సంగీత దర్శకుడు ఐన అనూప్ రూబెన్స్ గారి సంగీత ప్రదర్సన మనసుకి ఉల్లాసాన్ని పంచింది. వేలాదిగా తెలుగు వారు కలుసుకున్న ఈ మహా సమావేశం కోసం సింగపూర్ టూరిజం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒక పరంగా బిజినెస్ కారణంగా కలుసుకున్నా.. ఆహ్లాదకరంగా ఆనందించటానికి సింగపూర్ ఒక వేదికగా నిలిచింది .
సింగపూర్ నుంచి మలేషియా మరియు శ్రీలంకకు అనేక మంది పర్యాటకులుగా వెళ్ళారు. గార్డెన్స్ బై ది బే, చైనాటౌన్, మెర్లియన్ పార్క్, ఫ్రంటోసా వంటి ప్రదేశాలు మన తెలుగు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి.
ఆగష్టు 5న ఫ్రంటోసా ఐలాండ్ లో యాచ్ పార్టీ జరిగింది.
అనేక మంది ఈ పార్టీలో పాల్గున్నారు. ఆగష్టు 9న సింగపూర్ యొక్క స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో సింగపూర్ టూరిజం వారు ఏర్పాటు చేసిన బాణాసంచా(Fireworks) ప్రదర్శన కనుల పండగగా నిలిచింది.
చివరగా ఈ WTITC మహాసమావేశం కారణంగా మన తెలుగు వారి ప్రతిభ ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పబడింది.