BRS Party Fields Vodithala Sathish in Husnabad Assembly Constituency – బిఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వోడితల సతీష్ ను అభ్యర్థిగా నిలపనుంది

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) BRS పార్టీ హుస్నాబాద్ ( Husnabad )అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయనున్న అభ్యర్థిగా వోడితల సతీష్ Vodithala Sathish అధికారికంగా ప్రకటించబడ్డాడు.
సతీష్ కుమార్ ది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. సతీష్ పెదనాన్న ఒడితల రాజేశ్వర్ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. తండ్రి కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా సేవలందించాడు. పీవీ నరసింహారావు 1989లో రాంటెక్ నుండి ఎంపీగా పోటీచేసినప్పుడు సతీష్ తన స్నేహితులతో కలిసి పీవీకి ప్రచారం చేసాడు. 1995లో సతీష్ సింగాపురం గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 2001లో టీ.ఆర్.ఎస్.లో చేరాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసాడు. 2002లో టీ.ఆర్.ఎస్. హుజురాబాద్ మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 2005లో తుమ్మనపల్లి సింగిల్ విండో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 2006, 2011 లలో వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 2012లో హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జిగా నియమించబడ్డాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 73 మంది సర్పంచులను, ఐదుగురు జెడ్పీటీసీలను, 32 మంది ఎంపీటీసీలను, ముగ్గురు సింగిల్ విండో అధ్యక్షులు గెలవడంతో కీలకపాత్ర పోషించాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పై 34,269 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సీపీఐ పార్టీ అభ్యర్థి చాడ వెంకటరెడ్డి పై 70,530 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.