G. Prathap Reddy – గంగుల ప్రతాపరెడ్డి

గంగుల ప్రతాపరెడ్డి (జ.1950 జూలై 1) కర్నూలు జిల్లా చెందిన రాజకీయ నాయకుడు. అతను 1950 జూలై 1న కర్నూలు జిల్లాలోని యరగుడిదిన్నె గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి గంగుల తిమ్మారెడ్డి 1967లో ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించాడు. అతను హైదరాబాదులోని న్యూసైన్స్ కళాశాలలో బి.యస్సీ చదివాడు. అతను 1991 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నంద్యాల లోకసభ నియోజకవర్గం నుంచి,, 2004 ఎన్నికలలో ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాడు.
తాను గెలుపొందిన 1991లోనే పి.వి.నరసింహారావుకి ప్రధాని అయ్యే అవకాశం రావడంతో తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ స్థానాన్ని ఖాళీ చేశాడు.