Man Spends 11 Crores On A Rare Signed : ఆ పుస్తకం విలువ రూ. 11 కోట్లు..

నేటి ప్రపంచం ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతోంది. అయితే, సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేయకుండా పుస్తకాలను చదవడానికి ఇష్టపడే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకం నచ్చితే ఎక్కడికైనా వెళ్లి, వెంటనే కొంటారు. ఈ రోజుల్లో అటువంటి పుస్తకం కొనుగోలుదారులు ఉన్నారంటే అశ్చర్యం అనిపిస్తుంది కదూ..! తాజాగా ఇలాంటి ఘటననే వెలుగులోకి వచ్చింది.

వాస్తవానికి, ఈ పుస్తకం 100 సంవత్సరాల నాటి చారిత్రక పుస్తకం. దీనిని 1925లో అమెరికన్ రచయిత నెపోలియన్ హిల్ రాశారు. దీని పేరు ‘ది లా ఆఫ్ సక్సెస్’. అమెరికాలోని ఇడాహో నివాసి రస్సెల్ బ్రున్సన్ ఈ పుస్తకం మొదటి ఎడిషన్ను కొనుగోలు చేశారు. ఇందులో నెపోలియన్ సంతకం ఉండటం విశేషం. డైలీ స్టార్ నివేదిక ప్రకారం, రస్సెల్ ఈ పుస్తకం ఆన్లైన్లో విక్రయించబడటం చూసినప్పుడు, తాను అడ్డుకోలేక దానిని కొనాలని నిర్ణయించుకున్నాడు రస్సెల్ అనే ఒక వ్యక్తి. దాని కోసం ఆగమేఘాలపై పయనమయ్యాడు.
ఈ పుస్తకం ధర 1.5 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల రూ. 11 కోట్లకు పైగానే ఉండడంతో కొనడం అంత ఈజీ కాదు. దాదాపు నెల రోజుల పాటు విక్రేతతో చర్చలు జరిపి చివరకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఈ సమయంలో అతను తన భార్యను కూడా ఒప్పించాల్సి వచ్చింది ఎందుకంటే ఆమె అంత ఖరీదైన పుస్తకం కొనడానికి ఇష్టపడలేదని రస్సెల్ చెప్పారు. అయితే, రస్సెల్ తర్వాత తన భార్యను కూడా ఒప్పించి చివరకు పుస్తకాన్ని కొనుగోలు చేశాడు.
వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన రస్సెల్ ఈ పుస్తకాన్ని నెపోలియన్ హిల్ రాసిన అనేక ఇతర పుస్తకాలను కొనుగోలు చేశాడు. ఇందు కోసం రూ.18 కోట్లు వెచ్చించాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను ఈ పుస్తకాలను ప్రైవేట్ విమానంలో ఇంటికి తీసుకువచ్చాడు. ఎందుకంటే అంత ఖరీదైన పుస్తకం దుమ్ము, ధూళిని ఎదుర్కోవటానికి అతనికి ఇష్టం లేదు. అందుకే ప్రత్యేక విమానంలో వెళ్ళి మరీ ‘ది లా ఆఫ్ సక్సెస్’ పుస్తకానికి ఇంటికి తీసుకువచ్చాడు రస్సెల్.