Narayana Make Sensational Comments Against TDP Chief Chandrababu Naidu : ఎన్డీయే అధికారంలోకి రాకపోతే చంద్రబాబు నిర్ణయం ఇదే..

కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి రాదని, ఇండియా కూటమికి చంద్రబాబు మద్దతు ఇవ్వక తప్పదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతి బైరాగిపట్టేడలోని సిపిఐ కార్యాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీకి 400 స్థానాలు రావని, ఎన్డీయేకు తగిన మద్దతు రాకపోతే ఆ కూటమి నుంచి బయటికి వచ్చే మొదటి వ్యక్తి చంద్రబాబేనని జోస్యం చెప్పారు నారాయణ.
కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి రాదని, ఇండియా కూటమికి చంద్రబాబు మద్దతు ఇవ్వక తప్పదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతి బైరాగిపట్టేడలోని సిపిఐ కార్యాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీకి 400 స్థానాలు రావని, ఎన్డీయేకు తగిన మద్దతు రాకపోతే ఆ కూటమి నుంచి బయటికి వచ్చే మొదటి వ్యక్తి చంద్రబాబేనని జోస్యం చెప్పారు నారాయణ. అప్పుడేనా చంద్రబాబు తప్పు తెలుసుకొని లౌకికవాద పార్టీలకు మద్దతు ఇవ్వాల్సిందే అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ జగన్ను ఫాలో అవుతున్నారన్నారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదని హితవు పలికారు. తెలంగాణ గేయాన్ని కొత్తగా రూపొందించడాన్నిఅభినందిస్తున్నామని, ఇక చిహ్నం జోలికి పోకపోవడం మంచిదన్నారు. అభివృద్ధి పైన రేవంత్ దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ గేయానికి సంగీత దర్శకుడిగా కీరవాణిని పెట్టడాన్ని బీఆర్ఎస్ ప్రాంతీయవాదాన్ని లేవ నెత్తడం సబబు కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12 మంది సమైఖ్యవాదుల్ని మంత్రులుగా పెట్టిందన్నారు. సంగీతంలో కూడా ప్రాంతీయ వాదం తగదన్నారు.