#Telangan Politics #Telangana #Telangana News

 Hyderabad Irrigation Officials Caught By ACB Taking Bribe Of One Lakh Rupees : అవినీతికి పాల్పడిన ఇరిగేషన్ అధికారులు.. ఏసీబీకి ఎలా దొరికారంటే.. 

నలుగురు ఇరిగేషన్ శాఖ అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఈఈ బన్సీలాల్‌తో పాటు ఇద్దరు ఏఈలు, సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నలుగురిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్‎కు చెందిన బొమ్ము ఉపేంద్ర నాథ్ రెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

నలుగురు ఇరిగేషన్ శాఖ అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఈఈ బన్సీలాల్‌తో పాటు ఇద్దరు ఏఈలు, సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నలుగురిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్‎కు చెందిన బొమ్ము ఉపేంద్ర నాథ్ రెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అనుమతి ఇవ్వడం కోసం ఇరిగేషన్ అధికారులు రెండున్నర లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దీంతో ఉపేంద్రనాథ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పథకం రూపొందించుకున్నారు ఏసీబీ అధికారులు. ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో ఇఇతోపాటు ఇద్దరు ఏఈ లను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నిర్మాణం చేపట్టాలంటే రెండున్నర లక్ష రూపాయలకుగానూ అడ్వాన్స్‎గా లక్షయాభై వేల రూపాయలను తీసుకున్నారు. సర్వే చేయడం కోసం సర్వేయర్ గణేష్ కూడా రూ.40 వేలు డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితులలో ఏ1 వద్ద నుండి రూ.65 వేలు, ఏ3 వద్దనుండి రూ.35 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు ఎసిబి అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *