#Trending

 Air Hostess Arrested In Kerala After 1 Kg Gold Found In Rectum :విమానాశ్రయంలో అనుమానస్పదంగా ఎయిర్‌హోస్టెస్‌ ప్రవర్తన.. 

ఒకరు చెప్పుల్లో.. ఇంకొకరు ప్యాంట్‌ బెల్ట్‌లో.. మరొకరు బిస్కెట్ల రూపంలో.. కాదేదీ అనర్హం అంటూ గోల్డ్ స్మగ్లర్లు అన్ని అడ్డదారులు తొక్కేస్తున్నారు. విదేశాల నుంచి కిలోలకొద్ది బంగారాన్ని వేర్వేరు స్టయిళ్లలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ లలో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా, నిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతూనే ఉంది.

స్మగ్లింగ్.. స్మగ్లింగ్.. ఎటు చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఢిల్లీ టు గల్లీ.. సీపోర్ట్‌ టు ఎయిర్‌ రూట్‌.. అంతా స్మగ్లింగ్‌మయంగా మారుతోంది. ఎయిర్‌పోర్ట్‌ అంటేనే భద్రతకు కేరాఫ్.. నీడలా వెంటాడే సీసీ కెమెరాలు.. ప్యాసింజర్ల కదలికల్ని పసిగట్టే సెక్యూరిటీ.. లగేజీని బిట్ టు బిట్ స్కాన్‌ చేసే స్కానర్లు.. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నా స్మగ్లర్లు లెక్కచేయడం లేదు. మా దారి అడ్డదారి అంటూ.. విదేశాల్లో డెడ్‌చీప్‌గా దొరుకుతున్న బంగారాన్ని దేశంలోకి డంప్ చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా విమానాల్లో పనిచేసే క్రూని, ఎయిర్ హోస్టెస్‌లను కూడా వదలడం లేదు స్మగ్లర్లు. వారికి డబ్బు ఆశచూపి రొంపిలోకి దింపుతున్నారు.  తాజాగా కేరళలో ఓ ఎయిర్ హోస్టెస్‌ ఈ అక్రమ రవాణాకు యత్నిస్తూ అధికారులకు చిక్కింది. నిందితురాలు తన మలద్వారంలో కిలో బంగారాన్ని దాచినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు వెల్లడించారు. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మే 28న మస్కట్‌ నుంచి కన్నూర్‌ విమానాశ్రయంకు ఓ విమానం చేరుకుంది. అందులో గోల్డ్ స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు ఇంటిలిజెన్స్ నుంచి ఉప్పు అందింది. ఆ విమానంలో ఎయిర్‌హోస్టెస్‌గా ఉన్న సురభి ఖాతూన్‌ ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పక్కాగా సమాచారం రావడంతో.. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే..  ఆమెను అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే మలద్వారంలో 960 గ్రాముల గోల్డ్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల కస్టడీ విధించారు. దీంతో ఆమెను కన్నూర్‌ మహిళా జైలుకు తరలించారు. ఎయిర్‌లైన్‌కు చెందిన స్టాఫ్ ఇలా రహస్య భాగాల్లో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేయడం దేశంలో ఇదే తొలిసారని DRI అధికారులు తెలిపారు.

ఎయిర్‌పోర్ట్‌లో గోల్డ్ సీజ్… ఇలాంటి వార్తలు డెయిలీ వస్తూనే ఉంటాయి. అయినా స్మగ్లర్లు అక్రమ రవాణా ఆపడం లేదు. ఓసారి పట్టుబడితే మరోసారి కొత్తగా ట్రై చేస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతున్నా..గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. కొత్త కొత్త ఐడియాలతో కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు. దీంతో గోల్డ్ స్మగ్లింగ్.. అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *