#Top Stories

North Korea provocation again : మళ్లీ ఉత్తర కొరియా కవ్వింపు

దక్షిణ కొరియాపై ముందస్తు దాడి జరిపే సత్తా తమకుందని చాటడానికి.. అణ్వస్త్రాలను మోసుకెళ్లగల రాకెట్లతో ఉత్తర కొరియా సైన్యం తమ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సమక్షంలో యుద్ధ విన్యాసాలు చేపట్టింది.

సియోల్‌: దక్షిణ కొరియాపై ముందస్తు దాడి జరిపే సత్తా తమకుందని చాటడానికి.. అణ్వస్త్రాలను మోసుకెళ్లగల రాకెట్లతో ఉత్తర కొరియా సైన్యం తమ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సమక్షంలో యుద్ధ విన్యాసాలు చేపట్టింది. ఉత్తర కొరియా గతంలోనూ ఇలాంటి విన్యాసాలు జరిపింది కానీ, ఇటీవల గూఢచర్య ఉపగ్రహ ప్రయోగం విఫలమైన తరవాత జరపడం ఇదే మొదటిసారి. కిమ్‌ చూస్తుండగా కనీసం 18 రాకెట్లను ప్రయోగించారు. దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా బెలూన్ల ద్వారా చెత్త జారవిడవడం ఆవేశకావేశాలను పెంచింది. దీనికి ప్రతిగా దక్షిణ కొరియా సరిహద్దుల్లో లౌడ్‌స్పీకర్ల ద్వారా ఉత్తర కొరియా ప్రజలకు సందేశాలు వినిపించే అవకాశం ఉంది. కిమ్‌ ప్రభుత్వం ఉత్తర కొరియా ప్రజల మానవ హక్కులను ఎలా కాలరాస్తోందో తెలుపుతూ నినాదాలు, ప్రసంగాలను వినిపించవచ్చు. ఉత్తర కొరియన్లకు విదేశీ రేడియో, టీవీ ప్రసారాలు అందవు కాబట్టి లౌడ్‌ స్పీకర్లే శరణ్యం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *