#Sport News

Suresh Raina Is The Only Indian Player To Score Century In T20 World Cup :టీ20 ప్రపంచకప్‌లో ఏకైక సెంచరీ చేసిన ఒకే ఒక్కడు….

టీ20 ప్రపంచకప్‌ 9వ ఎడిషన్‌ జూన్‌ 1 నుంచి ఆతిథ్య అమెరికా, కెనడా మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద టోర్నీ అవుతుంది. ఈసారి నాలుగు గ్రూపులుగా విభజించి మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 8 టీ20 ప్రపంచకప్‌లు ముగిశాయి. ఆ వివరాలు ఇలా..

టీ20 ప్రపంచకప్‌ 9వ ఎడిషన్‌ జూన్‌ 1 నుంచి ఆతిథ్య అమెరికా, కెనడా మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద టోర్నీ అవుతుంది. ఈసారి నాలుగు గ్రూపులుగా విభజించి మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 8 టీ20 ప్రపంచకప్‌లు ముగిశాయి. ఈ ఎనిమిది ఎడిషన్లలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. అయితే ఈ పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌లో కేవలం 11 సెంచరీలు మాత్రమే లిస్టులోకి వచ్చాయి. ఇక ఈ జాబితాలో ఒకే ఒక్క టీమిండియా బ్యాటర్ ఉన్నాడు.

ఆ భారత ఆటగాడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. అతడే మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా. 2010, మే 2న దక్షిణాఫ్రికాపై సురేష్ రైనా సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 60 బంతులు ఎదుర్కొన్న రైనా 168.33 స్ట్రైక్ రేట్‌తో 101 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు 5 టీ20 ప్రపంచకప్‌లు జరిగాయి, కానీ ఏ భారత బ్యాట్స్‌మెన్ కూడా సెంచరీ చేయలేకపోయారు. టీ20 ప్రపంచకప్‌లో నమోదైన 11 సెంచరీల గురించి ప్రస్తావిస్తే.. 2 సెంచరీలతో క్రిస్ గేల్ అగ్రస్థానంలో నిలిచాడు. 2007లో దక్షిణాఫ్రికాపై, 2016లో ఇంగ్లాండ్‌పై గేల్ సెంచరీల మోత మోగించాడు. అతడితో పాటు సురేష్ రైనా, మహేల జయవర్ధనే, బ్రెండన్ మెకల్లమ్, అలెక్స్ హేల్స్, అహ్మద్ షెహజాద్, తమీమ్ ఇక్బాల్, జోస్ బట్లర్, రిలే రూసో, గ్లెన్ ఫిలిప్స్ తలో సెంచరీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *