Director Puri Jagannath On What Kind Of Movie Stories Suit Mahesh Babu :మహేష్‌కు అలాంటి కథలు చెప్తేనే సినిమా చేస్తాడు..

పూరిజగన్నాథ్ సినిమాలో డైలాగ్స్ యువతకు చాలా దగ్గరగా ఉంటాయి. రెగ్యులర్ గా యూత్ మాట్లాడుకునే డైలాగ్స్ తో పూరి సినిమాలు ఉంటాయి. అందుకే ప్రేక్షకులు పూరి సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ డైనమిక్ డైరెక్టర్. ఆయన కెరీర్ లో ఇడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇస్మార్ట్ శంకర్ లాంటి బడా బ్లాక్ బస్టర్ ఉన్నాయి.
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో ఆసక్తి మొదలవుతుంది. ఏ హీరో అయినా పూరిజగన్నాథ్ తో సినిమా చేస్తే ఆ హీరో యాక్టింగ్ స్కిల్స్ లో చాలా ఇంప్రూవ్ మెంట్ వస్తుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. హీరోలను మాస్ లుక్ లో చూపించాలంటే పూరిజగన్నాథ్ వల్లే అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్. పూరిజగన్నాథ్ సినిమాలో డైలాగ్స్ యువతకు చాలా దగ్గరగా ఉంటాయి. రెగ్యులర్ గా యూత్ మాట్లాడుకునే డైలాగ్స్ తో పూరి సినిమాలు ఉంటాయి. అందుకే ప్రేక్షకులు పూరి సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ డైనమిక్ డైరెక్టర్. ఆయన కెరీర్ లో ఇడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇస్మార్ట్ శంకర్ లాంటి బడా బ్లాక్ బస్టర్ ఉన్నాయి. ఇక రీసెంట్ గా లైగర్ లాంటి ఫ్లాప్ తర్వాత ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు పూరిజగన్నాథ్.
రామ్ పోతినేని తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు పూరిజగన్నాథ్. ఆతర్వాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాతో పూరి మరోసారి సూపర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోల గురించి పూరిజగన్నాథ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయాలంటే ఎవరికి ఏ కథలు చెప్పాలో పూరిజగన్నాథ్ గతంలో ఓ వేదిక పై మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇతర హీరోలతో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ ఖుష్ అయ్యేలా పూరీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.. “ఈ సినిమాలో గన్స్ ఎక్కువగా ఉంటాయి. హీరో ఓ పెద్ద గన్ డీలర్.. ఇష్టమొచ్చినట్టు కాల్చేసుకోవచ్చు అని చెప్తే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చేస్తారు. అలాగే అవుట్ డోర్ లో షూటింగ్ చేస్తున్నాం.. బయటకు వెళ్లకుండా సినిమా చేస్తున్నాం అంటే ప్రభాస్ డేట్స్ ఇచ్చేస్తాడు. ఈ ముప్పై రోజుల్లో సినిమా తీసేస్తున్నాం అంటే రవితేజ ఓకే చేస్తాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొడుతున్నాం అంటే.. తారక్ రెడీ అంటాడు. అలాగే ఇప్పుడు షూటింగ్ స్టార్ చేస్తున్నాం ఎప్పటికి కంప్లీట్ అవుతుందో తెలియదు అంటే మహేష్ బాబు డేట్స్ ఇచ్చేస్తారు ఇదే ఇండస్ట్రీలో ఉన్న టాక్” అని పూరిజగన్నాథ్ ఓ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మహేష్ బాబు పై పూరీచేసిన కామెంట్స్ తో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. మహేష్ డైరెక్టర్స్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.