Nivetha Pethuraj: పోలీసులతో గొడవపడ్డ నివేదా పేతురాజ్.. వైరలవుతోన్న వీడియో

పోలీసులతో నివేదా పేతురాజ్ గొడవ పడుతోన్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హీరోయిన్ నివేదా పేతురాజ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులతో ఆమె గొడవపడుతున్నట్లు ఉన్న ఆ వీడియో చూసినవారంతా తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అందులో ఏముందంటే..
కారులో ప్రయాణిస్తోన్న నివేదను పోలీసులు ఆపి డిక్కీ ఓపెన్ చేయాలని కోరారు. దీనికి ఆమె అంగీకరించకపోగా కోపంగా మాట్లాడారు. ‘రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్ చేయలేను’ అని కోపంగా చెప్పారు. ఇదంతా రికార్డు చేస్తున్న వ్యక్తి ఫోన్‌ను ఆమె లాగేసుకున్నారు. అయితే ఇది చూసిన నెటిజన్లు కావాలనే ఇలా చేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా ప్రమోషన్స్ కోసం ఇదంతా చేసుండొచ్చని భావిస్తున్నారు.
‘మెంటల్ మదిలో‘ అంటూ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నివేద.. చివరిసారి విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’లో కనిపించారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. దీంతో తన అప్‌కమింగ్ మూవీ కోసం ఇలా ప్రాంక్ చేసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.