#Top Stories

People Trapped In Floods Due To Cyclone Remal In Northeastern States : వణుకుతున్న ఈశాన్యం.. స్థంభించిన జనజీవనం..

భారీ వరదలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ తల్లడిల్లుతోంది. రాజధాని ఇంఫాల్‌లో జనజీవితం స్తంభించింది. నదులన్నీ ఉప్పొంగి ప్రవహించడంతో వందలాది ఇళ్ల లోకి వరదనీరు ప్రవేశించింది. రెమాల్‌ తుఫాన్‌ సృష్టించిన బీభత్సం నుంచి ఈశాన్య రాష్ట్రాలు తేరుకోవడం లేదు. తుఫాన్‌ కారణంగా మణిపూర్‌,అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదలతో తల్లడిల్లుతున్నారు జనం . మణిపూర్‌లో అయితే పరిస్థితి ఔట్‌ ఆఫ్‌ కంట్రోల్‌ అయ్యింది. వేలాదిమంది నిరాశ్రయులుగా మారారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి ఇప్పటికి కూడా జనం రిలీఫ్‌ క్యాంప్‌ల్లోనే ఆశ్రయం తీసుకుంటున్నారు.

భారీ వరదలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ తల్లడిల్లుతోంది. రాజధాని ఇంఫాల్‌లో జనజీవితం స్తంభించింది. నదులన్నీ ఉప్పొంగి ప్రవహించడంతో వందలాది ఇళ్ల లోకి వరదనీరు ప్రవేశించింది. రెమాల్‌ తుఫాన్‌ సృష్టించిన బీభత్సం నుంచి ఈశాన్య రాష్ట్రాలు తేరుకోవడం లేదు. తుఫాన్‌ కారణంగా మణిపూర్‌,అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదలతో తల్లడిల్లుతున్నారు జనం . మణిపూర్‌లో అయితే పరిస్థితి ఔట్‌ ఆఫ్‌ కంట్రోల్‌ అయ్యింది. వేలాదిమంది నిరాశ్రయులుగా మారారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి ఇప్పటికి కూడా జనం రిలీఫ్‌ క్యాంప్‌ల్లోనే ఆశ్రయం తీసుకుంటున్నారు. నంబూరి నదితో పాటు , ఇంఫాల్‌ నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వరద నీరు ఇళ్ల లోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సేనాపతి జిల్లా లోని వకో గ్రామంలో వంతెన కొట్టుకుపోవడంతో ఆ గ్రామంతో రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. వరదల కారణంగా మణిపూర్‌లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రజలను బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. స్థానిక కోర్టుల లోకి , జడ్జిల నివాసాలలోకి కూడా వరదనీరు ప్రవేశించింది. చాలా ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగులోంది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హైఅలర్ట్‌ జారీ చేసింది. మణిపూర్‌ లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల కారణంగా అపారనష్టం జరిగింది. వందలాది ఇళ్లు కుప్పకూలాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలడంతో ప్రాణనష్టం కూడా జరిగింది. మణిపూర్‌లో వరదలపై కేంద్రం కూడా అప్రమత్తమయ్యింది. రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *