#Trending

Elephant Angry On Tourist :గజరాజు బీభత్సం.. దెబ్బకు పర్యాటకుల కార్లు ధ్వసం.. జనం పరుగో పరుగు..

పర్యాటకులు తమ వాహనాల నుంచి కిందకు దిగి అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం రెండు కార్లపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో ఆ వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. అనంతరం సమీపంలోని పర్యాటకులపైకి కూడా ఏనుగు దూసుకెళ్లింది. అయితే, యువకులు పరుగులు తీయడంతో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఏనుగు దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

అటవీ శివారు ప్రాంతాల్లో తరచూ ఏనుగులు దాడులు చేస్తుంటాయి. పంటపొలాలపై పడి విధ్వంసం సృష్టిస్తాయి. అడ్డుకోబోయిన ప్రజలపై కూడా దాడి చేసిన ఘటనలు అనేకం వార్తల్లోనే వింటుంటాం, చూస్తుంటాం కూడా. ఏనుగుల దాడికి సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోతుండగా, ఒక్కోసారి పెద్ద మొత్తంలో ఆస్తి నష్టాలు కూడా జరిగాయి. తాజాగా ఇలాంటి సంఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మున్నార్‌ లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో పర్యాటకులు, వాహనదారులంతా ప్రాణభయంతో తమ వాహనాలను వదిలి పరుగులు తీశారు. ఏనుగు దాడిలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన కల్లార్‌ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Elephant Angry On Tourist :గజరాజు బీభత్సం.. దెబ్బకు పర్యాటకుల కార్లు ధ్వసం.. జనం పరుగో పరుగు..

rocodile Swims Out Of Canal Tries To

Leave a comment

Your email address will not be published. Required fields are marked *