#Cinema

Gunasekhar: కొత్త సినిమా ప్రకటించిన గుణశేఖర్‌.. ఆసక్తికరంగా టైటిల్‌.

దర్శకుడు గుణశేఖర్‌ కొత్త సినిమాను ప్రకటించారు. దాని టైటిల్‌ ఆసక్తికరంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇంటర్నెట్‌ డెస్క్: తన సినిమాలతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే దర్శకుల్లో గుణశేఖర్‌ ఒకరు. ఆయన నుంచి కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ విభిన్నమైన కాన్సెప్ట్‌తో కొత్త మూవీని ప్రకటించారు. గుణటీమ్‌వర్క్స్‌పై దీన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ‘యుఫోరియా’ (Euphoria) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. నీలిమా గుణశేఖర్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతోన్న ఈ ప్రాజెక్ట్‌లోని నటీనటుల వివరాలను టీమ్‌ త్వరలోనే ప్రకటించనుంది.

‘చూడాలని ఉంది’, ‘ఒక్కడు’, ‘రుద్రమదేవి’ వంటి ఎన్నో గొప్ప సినిమాలను తెరకెక్కించారు గుణశేఖర్‌ (Gunasekhar). చివరిసారి ‘శాకుంతలం’తో ప్రేక్షకులను పలకరించారు. పౌరాణిక చిత్రంగా తెరకెక్కిన ఇందులో స్టార్‌ హీరోయిన్ సమంత నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయినప్పటికీ గుణశేఖర్‌ మేకింగ్‌కు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. దాని తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న ఆయన తాజాగా ‘యుఫోరియా’తో మరోసారి తన మార్క్‌ చూపేందుకు సిద్ధమయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *