Ajith – Nayanthara as a couple again ? అజిత్ – నయనతార మరోసారి జంటగా?

అజిత్ – నయనతారల జంటకు సినీప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘బిల్లా’, ‘విశ్వాసం’ తదితర చిత్రాలు బాక్సాఫీస్ ముందు భారీ విజయాల్ని అందుకున్నాయి.
అజిత్ – నయనతారల జంటకు సినీప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘బిల్లా’, ‘విశ్వాసం’ తదితర చిత్రాలు బాక్సాఫీస్ ముందు భారీ విజయాల్ని అందుకున్నాయి. అయితే ఇప్పుడీ జంట మరోసారి తెరపై సందడి చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అజిత్ కథానాయకుడిగా అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నాయికగా నయనతార పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది వీళ్లిద్దరి నుంచి రానున్న ఐదో సినిమా కానుంది. ప్రస్తుతం నయన్ నటించిన ‘టెస్ట్’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘డియర్ స్టూడెంట్’ చిత్రీకరణ దశలో ఉంది. అలాగే మమ్ముట్టి, కవిన్ రాజ్ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.