#ANDHRA ELECTIONS #Andhra Politics #Elections

AP Elections: లండన్ వెళ్లిన జగన్ తిరిగి వస్తారో.. రారో..!!: వర్ల రామయ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమి తెలియదని, అన్ని తెలుసు అని బిల్డప్ ఇస్తారని విమర్శించారు. వెబ్ క్యాస్టింగ్ పరిశీలించేంది ఎన్నికల సంఘం అని వర్ల రామయ్య స్పష్టం చేశారు. వెబ్ క్యాస్టింగ్‌కు చంద్రబాబుకు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.

ఓటమి ఖాయం

మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఘోర పరాజయం తప్పదని వర్ల రామయ్య ఆరోపించారు. మాచర్ల ప్రజలు స్వేచ్ఛ కావాలని అనుకుంటున్నారని గుర్తుచేశారు. పిన్నెల్లి సోదరుల కబంద హస్తాల నుంచి మాచర్ల ప్రజలకు విముక్తి కలుగనుందని వివరించారు. మాచర్లలో రిజిష్టర్ అయిన ప్రతి కేసులో పిన్నెల్లి బ్రదర్స్ ఏ1 అని పేర్కొన్నారు. పోలీసులు కేసులను సరిగా విచారిస్తే మాచర్ల సోదరులు ఏ1 అవుతారని స్పష్టం చేశారు.

వైసీపీ నేతలకు తెలిసింది..!!

ఓడిపోతున్నామని వైసీపీ నేతలకు అర్థమయ్యిందని వర్ల రామయ్య వివరించారు. ఆ పార్టీ నేతలు బయటకు రావడం లేదని వివరించారు. లండన్ వెళ్లిన సీఎం జగన్ తిరిగి వస్తారో రారో అని సందేహం వ్యక్తం చేశారు. తమ అధినేత చంద్రబాబు మాత్రం అమెరికా నుంచి తిరిగి వస్తారని తేల్చి చెప్పారు. జగన్ లండన్ వెళ్లే సమయంలో వైసీపీకి 144 సీట్లు వస్తాయని చెప్పారట.. అబద్దాలు చెప్పి మసిపూసి మారేడు కాయ చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి అనుకుంటున్నారని మండిపడ్డారు.

వైసీపీ తిరస్కరణ..!!

రాష్ట్రంలో వైసీపీని ప్రజలు తిరస్కరించారని ఆ పార్టీ నేతలకు అర్థమయ్యింది. కొన్ని సెంటర్లలో కౌంటింగ్ రోజున ఏజెంట్లుగా వెళ్లేందుకు ముందుకు రావడం లేదని వర్ల రామయ్య గుర్తుచేశారు. అన్నిరోజులు ఒకేలా ఉండవనే విషయాన్ని సీఎం జగన్ సహా వైసీపీ నేతలు తెలుసుకోవాలని కోరారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వచ్చింది.. 4వ తేదీన అది స్పష్టం అవనుందని వర్ల రామయ్య తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం కావాలని జనం అనుకుంటున్నారు, మార్పు కోసం టీడీపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *