#Trending

Srh Owner Kavya Maran Crying After Srh Loss : SRH ఓటమితో కావ్యపాప కన్నీళ్లు.. ఫ్యాన్స్ హార్ట్..

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, Final: ఐపీఎల్ 2024 ఫైనల్ ముగిసింది. చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 57 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. కేకేఆర్ జట్టు తొలుత బంతితో, తర్వాత బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసింది. హైదరాబాద్ జట్టు 113 పరుగులకు ఆలౌటైంది. అయితే, KKR జట్టు కేవలం 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుంది.

Kavya Maran Cried: ఐపీఎల్ 2024 ఫైనల్ ముగిసింది. చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 57 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. కేకేఆర్ జట్టు తొలుత బంతితో, తర్వాత బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసింది. హైదరాబాద్ జట్టు 113 పరుగులకు ఆలౌటైంది. అయితే, KKR జట్టు కేవలం 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుంది. దీంతో ఈ విజయం తర్వాత షారుక్ ఖాన్, అతని కుటుంబం మొత్తం, KKR ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ మాత్రం బోరున విలపించింది.

కన్నీళ్లు పెట్టుకున్న కావ్య మారన్..

కావ్య మారన్ మొదటి నుంచి స్టాండ్స్‌లో కూర్చొని తన టీమ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే, ఫైనల్ ఓటమి తర్వాత ఆమె కన్నీరు పెట్టుకుంది. హైదరాబాద్ ఓడిపోవడంతో కావ్య మారన్ ఏడ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత పక్కనున్న ఆమె స్నేహితులు కన్నీళ్లు తుడిచారు. అయితే, ఆ తర్వాత కూడా ఆమె ఏడుస్తూనే ఉంది. కావ్యకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మ్యాచ్ గురించి మాట్లాడితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ చేయడంతో జట్టు మొత్తం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ తరపున మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా 1 వికెట్, హర్షిత్ రాణా 2 వికెట్లు, సునీల్ నరైన్ 1 వికెట్, ఆండ్రీ రస్సెల్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు. బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ తరపున ఐడెన్‌ మార్క్రామ్‌ 20, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 13, హెన్రీ క్లాసెన్‌ 16, కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ 24 పరుగులు చేశారు. దీంతో మొత్తం జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *