#Trending

Maoist militia members who voluntarily surrendered : స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యులు

13 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదివారం తెలిపారు.

పాడేరు: 13 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదివారం తెలిపారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు పెదబయలు మండలం కిన్నెల కోట పంచాయతీకి చెందిన వీరందరిపై పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వీరందరూ మావోయిస్టులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించడం, భోజనాలు పెట్టడం, వస్తు సామాగ్రి అందజేయడం వంటి పలు అసాంఘిక కార్యకలాపాలు చేసేవారని పేర్కొన్నారు. వీరందరూ సుమారుగా పదేళ్ల నుంచి వివిధ రూపాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధివైపు అడుగులు వేయడంతో వీరంతా లొంగిపోయేందుకు ముందుకు వచ్చారని ఆయన చెప్పారు. లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సహకాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఓ మిలీషియా సభ్యుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం తాము మావోయిస్టు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నామని వారి పన్నుల పట్ల విసిగి చెంది లొంగిపోయినందుకు నిర్ణయించుకున్నామని పేర్కొన్నాడు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *