#Top Stories

Delhi Fire Accident: దేశ రాజధానిలో ఘోరం.. బేబీ కేర్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. ఏడుగురు శిశువుల మృతి..

Baby Care Center Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మృతి చెందారు.. మరికొందరు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుర్ఘటన తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని పిల్లల ఆసుపత్రిలో శనివారం రాత్రి జరిగింది.

Baby Care Center Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మృతి చెందారు.. మరికొందరు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుర్ఘటన తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని పిల్లల ఆసుపత్రిలో శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు శిశువులు మృతి చెందగా.. మరో ఆరుగురు శిశువులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. హుటాహుటిన స్పాట్‌కి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. 12 మంది నవజాత శిశువుల్ని రక్షించారు. వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా.. చిన్నారుల మృతి తల్లిదండ్రులు కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.. హాస్పిటల్‌ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

శనివారం రాత్రి 11:30 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని, వెంటనే తొమ్మిది ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి పంపామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపింది. ఇంతలో, DFS చీఫ్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని.. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.

12 మంది నవజాత శిశువులను రక్షించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి తెలిపారు. వీరిలో 6 మంది మృతి చెందగా, ఒకరు వెంటిలేటర్‌పై, ఐదుగురు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *