Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు…

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.

- బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
- బెంగళూరు రేవ్ పార్టీ ఘటనపై 8 మందికి నోటీసులు
- రక్త నమూనాలలో డ్రగ్స్ తీసుకున్నారని తేలిన వారికి నోటీసులు
- నటి హేమతో పాటూ 8 మందికి నోటీసులు జారీ చేసిన సీసీబీ
- సోమవారం బెంగళూరు సీసీబీ పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసుల జారీ
- ఉదయం 10 గంటలకు సీసీబీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న సీసీబీ
- ఇప్పుడే మొదలైంది..!
- రేవ్ పార్టీలో పట్టుబడిన 101 మంది బ్లడ్ శాంపిల్స్ పరీక్ష
- 101 మందిలో 86 మందికి రక్త నమూనాలలో డ్రగ్స్ ఆనవాళ్లు
- 59 మంది పురుషులు, 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ
- పార్టీలో ఉన్న 30 మందిలో 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ
- డ్రగ్స్ తీసుకున్న వారందరికీ నోటీసులు పంపుతున్న సీసీబీ పోలీసులు
- తొలి విడతలో 8 మందికి నోటీసులు జారీ చేసిన బెంగళూరు సీసీబీ